రాబోయే ఎన్నికలలో బిజెపి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శంకర్పల్లి మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ల రాములు గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గాజులగూడ, లక్ష్మారెడ్డిగూడ, ఆలంఖాన్ గూడ గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బిజెపి సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి అతి పెద్ద పార్టీ అన్నారు.