జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైందని తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్ బంధువు రాజ్ పాకాలకు మోకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి నోటీసులు అంటించారు. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఇప్పటికే రాజ్ పాకాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై అధికార పార్టీ, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.