రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లిలో గురువారం పండుగల సాయన్న విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం యువత అధ్యక్షులు శ్రీధర్ వర్మ, ముదిరాజ్ తాలూకా యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ ముదిరాజ్, పలువురు షాద్ నగర్ ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగల సాయన్న సేవలను కొనియాడారు.