

శవాల దిబ్బగా విమాన ప్రమాద స్థలి (VIDEO)
గుజరాత్లోని అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలి శవాల దిబ్బగా మారింది. స్మశానాన్ని తలపిస్తున్న ఈ స్థలం మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ఎక్కడికక్కడ మంటల్లో కాలిపోయి శరీరాలన్నీ భస్మాంగా మారాయి. ఈ దృశ్యం చూస్తేనే గుండెల్లో వణుకుపుడుతోంది. కాగా, ప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోందని AAIB పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌరవిమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.