రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, మండల పరిధిలో గల ఊరేళ్ల గ్రామంలో మాజీ ఎంపీపీ కర్నె శివప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక హనుమాన్ దేవాలయములో నిర్వహించిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.