సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య

54చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య భేటీ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ను శాలువాతో సత్కరించారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం రేవంత్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. చేవెళ్లకు సీడీపీ నిధులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఇటీవల విన్నవించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్