కొండకల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

81చూసినవారు
కొండకల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం
కొండకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న మహిళా ఉపాధ్యాయులను శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే జయంతిని రాష్ట్రప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలనుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు. సావిత్రీబాయి పూలే జీవిత విషయాలను విద్యార్థులకు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్