సమీకృత రంగా రెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (70) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా రెవెన్యూ అధికారి సంగీతకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులను అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని అన్నారు.