ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగులూర్, కొంగరకలాన్ లోని 11వ వార్డులో 10 లక్షల రూపాయల సీసీ రోడ్డు, 3 లక్షల రూపాయలతో వాటర్ పైప్ లైన్, కొంగరకలాన్ 8వ వార్డు లొ 15 లక్షల రూపాయల సిసి రోడ్డు పనులను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కామాండ్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.