
రాదేశ్ ఆత్మహత్య.. ‘పైనుంచి మిమ్మల్ని చూస్తుంటా’
AP: విశాఖ జిల్లా అగనంపూడి సమీపంలో రైలు కింద పడి రాదేశ్ (38) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. అతని జేబులో పోలీసులు లేఖను గుర్తించారు. ఆ లేఖలో తన మృతికి ఎవరూ కారణం కాదని, అన్నయ్య పిల్లలు బాగా చదువుకోవాలని.. పైనుంచి మిమ్మల్ని చూస్తుంటానని రాసి ఉంది. మృతుడిది శ్రీహరిపురం అని పోలీసులు గుర్తించారు. ఉద్యోగం రాలేదన్న మనస్థాపంతో మృతి చెందినట్లు సమాచారం.