ఇబ్రహీంపట్నం: నేడు గౌరెల్లిలో సుదర్శన హోమం

62చూసినవారు
ఇబ్రహీంపట్నం: నేడు గౌరెల్లిలో సుదర్శన హోమం
పెద్దఅంబర్ పేట్ మున్సిపల్ పరిధిలోని గౌరెల్లిలో కొలువైన శ్రీ స్వయం భూ లక్ష్మీనరసింహాస్వామి ఆలయం వద్ద శుక్రవారం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నెల్లూరి రాజు, వైస్ చైర్మన్ చెంచలి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం నుంచి స్వామివారికి అభిషేకం, సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారని వివరించారు. అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్