ఆదిబట్ల మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మున్సిపాలిటీలోని 9వ వార్డులో 29 లక్షలతో సీసీ రోడ్డు, భూగర్భ డ్రైనేజీ, 5వ వార్డులో 10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. పదిహేను వార్డుల్లో సమస్యలు లేకుండా కృషి చేస్తున్నామ న్నారు. భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, సీసీ రోడ్లు, తాగునీరు వసతి కల్పిస్తున్నామన్నారు.