గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య శుక్రవారం ఆరోపించారు. మాడ్గుల మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హమీ కూలీలు పని చేస్తున్న ప్రదేశాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే కుట్రను వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.