భారతీయ జనతా పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు తుమ్మల సంధ్య నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రాధిక క్రాస్ రోడ్స్ వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. సంధ్యా రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వార్షిక బడ్జెట్ మోడీ 3. 0 వికసిత్ భారత్ బడ్జెట్ పేద మహిళ మధ్యతరగతి ఉద్యోగ వర్గాలకు మేలు చేసే బడ్జెట్ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అంబటి వెంకటాచలం హాజరయ్యారు