విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాల విద్యార్థులకు వాలీబాల్, ఖోఖో, కబడ్డీ క్రీడలను ఇబ్రహీంపట్నంలోని గురుకుల విద్యాపీఠ్ బుధవారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. మానసికోల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.