హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసారు. హనుమాన్ జయంతి సందర్భంగా వేకువజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.