పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ 4వ వార్డులోని రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యావిజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాలుగో వార్డ్ పరిధిలోని పలు కాలనీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. సిసి రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.