కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు

82చూసినవారు
కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ లీగల్ నోటీసులు
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీస్ పంపించారు. తన పరువుకు నష్టం కలిగేంచేలా వ్యాఖ్యలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. వారం రోజుల్లో బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని అన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించాయని కేటీఆర్ ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు నిరాధారమైనవి అన్నారు.

సంబంధిత పోస్ట్