కొడంగల్ నియోజకవర్గంలో సిపిఎం బలోపేతానికి ప్రణాళికలు రూపొందించినట్లు వక్తలు తెలిపారు. సీపీఎం 3వ మహాసభల సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య మాట్లాడారు. సిపిఎం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో పేద రైతుల భూములు లాక్కోవడం సరైంది కాదని మండిపడ్డారు.