కోస్గి మండల విద్యాధికారిగా గురువారం శంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు. మండలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఏంఈఓను నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు బస్వరాజు యాదవ్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.