బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 19 వ డివిజన్ గాయత్రి హిల్స్ కాలనీకి సంబంధించినటువంటి సర్వే నంబర్ 776, 756 లో ఓపెన్ స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకులు దౌర్జన్యంగా కబ్జా చేసి భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇట్టి స్థలాలను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకోవాలని బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి గురువారం వినతి పత్రం అందజేశారు.