సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తా: కార్పొరేటర్

72చూసినవారు
సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తా: కార్పొరేటర్
కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన కుమార్ అన్నారు. రాజీవ్ గాంధీనగర్ ఫేస్-2 కమ్యూనిటీ హాల్లో నూతన తాగు నీటి కనెక్షన్ ఇప్పించి గురువారం కాలనీ వాసులతో కలిసి నీటి సరఫరా ప్రారంభించారు. కాలనీలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు స్వామి, దుర్గేశ్, భిక్షపతి, వాజిత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్