పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి గడ్డిఅన్నారం కార్పొరేషన్

81చూసినవారు
నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని శారదానగర్లో డ్రైనేజీ లైన్ పనులను పరిశీలించారు. రూ. 2 లక్షలతో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇటీవల భారీ వాహనాలు వెళ్లడంతో డ్రైనేజీ ధ్వంసం అయిందని, దీంతో మరమ్మతులు చేపడుతున్నామని వెల్లడించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్