హయత్ నగర్: సర్కారు చెట్టును నరికిన అపార్ట్మెంట్ నిర్వాహకుడు

80చూసినవారు
హయత్ నగర్: సర్కారు చెట్టును నరికిన అపార్ట్మెంట్ నిర్వాహకుడు
ఒక్క పక్క రోజు రోజుకూ వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంటే ప్రయివేటు నిర్వాహకులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చెట్లను నరికి వేస్తున్నారు. అయినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చెట్లు నరకడం మరింత ఎక్కువ అవుతుందనే చెప్పవచ్చు. హయత్ నగర్ లోని వసంత నగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ బిల్డర్ సర్కారు చెట్టును ఆదివారం నరికివేశారు. ఆ చెట్టు నాటి సుమారు 10 ఏండ్లు కావస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్