రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలు సోమవారం మధ్యాహ్నాం విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య రవి ఆదివారం తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3. 30 గంటలకు ఫలితాలను వెల్లడిస్తారు.