చింతల్ కుంట జహంగీర్ నగర్ కాలనీ నుంచి సాగర్ రింగ్ రోడ్ వెళ్లే రూట్లో రోడ్డును బ్లాక్ చేసి బల్దియా వాటర్ బోర్డ్ అధికారులు రోడ్లు డ్రైనేజీలు పనులు చేస్తూ నగరవాసులను ఇబ్బంది పెడుతున్నారు. వర్షా కాలానికి ముందే పూర్తి చేయాల్సి ఉండంగా బల్దియా జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వహించింది. అసలే వర్షాలకు ట్రాఫిక్ మెల్లి మెల్లగా కదులుతుంటే ఈ పనులతో ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి.