వాహనదారులు, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు, షెడ్డుల ఏర్పాటు, సైన్ బోర్డులను పెట్టడం వంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీహెచ్ ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులు, ర్యాంప్, సైన్ బోర్డులను బుధవారం జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులతో కలిసి తొలిగించారు.