పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని నాగోలు డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ సూచించారు. నాగోలు డివిజన్ పరిధి చాణక్యపురికాలనీలో శుక్రవారం నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కార్పొరేటర్ పాల్గొని మాట్లాడారు. కాలనీలోని రోడ్లపై చెత్తా చెదారాలు ఉండకుండా ఎప్పటికప్పుడు తరలించాలన్నారు. కాలనీ వాసులు కూడా రోడ్లపై చెత్త వేయకుండా స్వచ్చఆటోలకు ఇవ్వాలని సూచించారు.