Top 10 viral news 🔥


త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం (వీడియో)
అదృష్టవశాత్తూ ఓ మహిళ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎత్తయిన రోడ్డుపైకి బ్రిక్స్ లారీ ఎక్కుతుండగా.. మహిళ వెనుక నుంచి స్కూటీపై వచ్చారు. అయితే అదుపు తప్పిన ఆ లారీ ఒక్కసారిగా వెనక్కి రావడంతో మహిళను ఢీకొట్టింది. స్కూటీపైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు మహిళ పక్కకి దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కేరళలోని పెరుమన్న పట్టణంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరలయ్యాయి.