చైతన్యపురి వైల్డ్ హార్ట్ క్లబ్ లో సోమవారం అర్ధరాత్రి పోలీసుల సోదాలు నిర్వహించారు. పబ్ ను సమయానికి మించి నడుపుతు, యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తూ కస్టమర్లని ఆకట్టుకునేలా యువతులతో స్టెప్స్ వేయించి పబ్ నిర్వహిస్తున్నారు. ముంబై నుండి యువతులను తీసుకొచ్చి పబ్ కస్టమర్స్ కి ఎర వేస్తున్న పబ్ యాజమాన్యంతో పాటు కస్టమర్స్, 17మంది యువతులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.