ఎల్బీనగర్: చిత్రకారుడి అద్భుతం.. నోటితో అంబేద్కర్ చిత్రం

66చూసినవారు
ఎల్బీనగర్: చిత్రకారుడి అద్భుతం.. నోటితో అంబేద్కర్ చిత్రం
ఎల్బీనగర్‌ నాగోల్ కి చెందిన ప్రముఖ సీనియర్ చిత్రకారుడు నాగార్జునపు రాము అద్భుత కళా నైపుణ్యం చూపించాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన తన చిత్రకళ ద్వారా ఒక వినూత్నమైన నివాళి అర్పించారు. నాగార్జునపు రాము తన నోటిలోని మార్కర్ పెన్నుతో ఒక తెల్ల కాగితంపై అంబేద్కర్ చిత్రాన్ని గీసి అంబేద్కర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.

సంబంధిత పోస్ట్