ఎల్బీనగర్: డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

52చూసినవారు
ఎల్బీనగర్: డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
హస్తినాపురం డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ బానోతు సుజాతా నాయక్ అన్నారు. శుక్రవారం ఆమె వందనపురికాలనీలో పర్యటిస్తూ మాట్లాడారు. డివిజన్ పరిధిలోని అన్నిప్రాంతాలలో వరదనీటి సమస్యను పరిష్కరించేందుకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. భారీ వర్షాలతో వివిధ కాలనీల్లో వరదనీటితో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని జిల్లా మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా రూ 7. 50 కోట్ల మంజూరు చేయించారన్నారు.

సంబంధిత పోస్ట్