ఎల్బీనగర్: అభివృద్ధికి కృషి చేస్తా

55చూసినవారు
ఎల్బీనగర్: అభివృద్ధికి కృషి చేస్తా
బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ హరిహర పురం కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హరిహరపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి కాలనీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రాబోయే వర్షా కాలంలో ఎగువ కాలనీల నుంచి వచ్చే వరద నీరు కాలనీని ముంచెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్