మహేశ్వరం: బెల్ట్ షాపులను నిర్మూలించాలి: ఇబ్రహీం శేఖర్

73చూసినవారు
మహేశ్వరం: బెల్ట్ షాపులను నిర్మూలించాలి: ఇబ్రహీం శేఖర్
బెల్టు షాపుల నిర్మూలనకు నాంది పలకాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్ శనివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపారాలకు సమయ భావం పాటిస్తున్నారు. బెల్ట్ షాపులు మాత్రం 24 గంటలు తెరిచే ఉంటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బెల్ట్ షాపులు 24 గంటలు తెరిచి ఉండడం వలన చాలా అనర్ధాలకు దారితీస్తుందని ఆయన అన్నారు. బెల్ట్ షాప్ ల నిర్మూలనకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్