ఎల్బీనగర్ నుంచి సరూర్ నగర్ చెరువు వరకు సీఎం రోడ్డు మీదుగా 1000 ఎంఎం డయా పైప్ లైన్ మంజూరు చేయాలని శనివారం లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి జలమండలి ఎండీ అశోక్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ, నవోదయ కాలనీ, శాతవాహననగర్, కాకతీయ కాలనీ, మైత్రీనగర్, సౌభాగ్యనగర్, అధికారినగర్ లో డ్రైనేజీ, వరదనీటి సమస్యల పరిష్కారం కోసం ఈ పైపైన్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.