ఓపెన్ ప్లాట్లకు టాక్స్ ను మినహాయించాలని జీఓ 118 ద్వారా డీడ్ ఆఫ్ కన్వీనియన్స్ పొందిన వారందరికీ ఈ మినహాయింపును వర్తింపజేయాలని బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్ను ఆయా కాలనీల ప్రతినిధులతో కలిసి వినతిపత్రం అందజేశారు. జెడ్సీని కలిసిన వారిలో దామోదర్ రెడ్డి, మహేందe సుధాకర్ రెడ్డి , ప్రదీప్ పెంటారెడ్డి, శ్రీధర్ రావు , రాంరెడ్డి ఉన్నారు.