జాతీయ లోక్ అదాలత్ ను అందరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. కర్ణ కుమార్ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, హైకోర్టు సూచనల మేరకు రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జూన్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆయన సూచించారు. జిల్లాలో జూన్ 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టు భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు.