రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో శనివారం దుద్దిల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. మంగు రాఘవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షులు రవి శర్మ పాల్గొన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ బ్రాహ్మణులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని మా వంతు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.