సహజ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: గౌరీ కృష్ణ

83చూసినవారు
ఎల్ బి నగర్ నియోజకవర్గం యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని సహజ యోగా రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరి కృష్ణ ఆదివారం అన్నారు. ఈనెల 28న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న సహజ యోగా ధ్యానం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌరీ కృష్ణ మాట్లాడుతూ మాతాజీ నిర్మల దేవి స్థాపించిన సహజ యోగా నేడు 170 దేశాల్లో విస్తరించింది అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్