ఎల్ బి నగర్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హస్తినపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దెంది శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ రెడ్డి , మంద బలరాం, మేడి మహేష్, ఎల్బీనగర్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షైక్ షక్కిర్, సాయి యాదవ్ ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.