యువతకు ఉపాధి కల్పన కే రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆదివారం ఆమనగల్లులో కడ్తాల్ మండలం కర్కల్పహాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఏర్పాటు చేసిన షాప్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అంది వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.