కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ కోరారు. ఆదివారం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో 197వ బూత్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కమిటీ నూతన అధ్యక్షునిగా బాలు నాయక్, ఉపాధ్యక్షులుగా హరిలాల్, ప్రధాన కార్యదర్శిగా శివరాం, నారి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందించి అభినందించారు.