స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని నాయకులు చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని క్రమశిక్షణ, పట్టుదలతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాపిశెట్టి రాము, తదితరులు పాల్గొన్నారు.