ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ వేశారని, 10 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను భర్తీ చేసి,పెండింగ్ లో ఉన్న ఎంఈఓ పోస్టులలో హెచ్ఎం లను నియమించిందన్నారు.