ఆమనగల్లు పట్టణంలోని అసంపూర్తి జూనియర్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణాలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసంపూర్తి కళాశాల భవనం నుండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసిల్దార్ లలితకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పత్య నాయక్, నిరంజన్ గౌడ్, సయ్యద్ ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.