కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఉనికిని కాపాడుకునేందుకోసం బీఆర్ఎస్ నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ విమర్శించారు. శనివారం ఆమనగల్లులో మాట్లాడుతూ 10 ఏళ్లుగా అధికారంలో ఉండి నాగర్ కర్నూల్ ఎంపీ, కల్వకుర్తి ఎమ్మెల్యేగా వారే ప్రజాప్రతినిధులుగా ఉండి ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.