ప్రణాళికలను రూపొందించి అమలు చేయడంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ఎంపీడీవో కుసుమ మాధురి చెప్పారు. శుక్రవారం ఆమనగల్లు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో బ్లాక్ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పై చర్చించి ప్రణాళికలను రూపొందించారు. కార్యక్రమంలో ఏపీఓ మాధవరెడ్డి, ఎంఈఓ పాండు, అన్ని శాఖల అధికారులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.