ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం కార్యక్రమం నిర్వహించారు. గ్రామంతో పాటు వివిధ గ్రామాల భక్తులు పాల్గొని రథాన్ని గ్రామ వీధులలో లాగి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ గోదాదేవి సత్యం, ఆలయ చైర్మన్ సింగిడి శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు.