ఆమనగల్లు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వాసుపత్రి భవన నిర్మాణం పనులను శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి భవనం నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని చెప్పారు. భవన నిర్మాణం పనులను సకాలంలో నాణ్యతగా పూర్తిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.