రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయం, మోడల్ స్కూల్ కు, తాండ్ర ఉన్నత పాఠశాల భవన నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.